మా అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించినట్లు నాగబాబు చెప్పారు. రాజేంద్రప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ.. చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు అన్నారు.