పోలీసులో.. గూండాలో కూడా తెలీదు | we-do-not-know-whether-they-are-police-or-not-says-ambati-rambabu | Sakshi
Sakshi News home page

Jan 26 2017 5:40 PM | Updated on Mar 22 2024 10:49 AM

విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని, వ్యాన్ ఎక్కమని చెప్పారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. రన్‌వే మీదనే తమను అడ్డుకున్నారని, స్థానిక పోలీసులు మఫ్టీలో వచ్చి అక్కడ ఆపారని అన్నారు. అసలు మఫ్టీలో వచ్చామంటున్న వాళ్లు పోలీసులో గూండాలో కూడా తమకు తెలియడంలేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు నాయకులు విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement