తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు వస్తున్న కథనాలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఖండించారు. పన్నీర్ సెల్వం వర్గీయులే తమను బెదిరిస్తున్నారని, ఫోన్‌లో తనను కూడా బెదిరించారని ఆమె చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని, గవర్నర్ నిర్ణయం కోసమే తాము వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువడగానే తామంతా బయటకు వస్తామని, అలాగే ఇక్కడ క్యాంపులో ఎవరూ నిరాహార దీక్షలు చేయడం లేదని కూడా రామ జయలింగం చెప్పారు.
Feb 10 2017 2:37 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement