breaking news
mlas kidnap
-
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
-
మేం ఎవరినీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి
తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లు వస్తున్న కథనాలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఖండించారు. పన్నీర్ సెల్వం వర్గీయులే తమను బెదిరిస్తున్నారని, ఫోన్లో తనను కూడా బెదిరించారని ఆమె చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని, గవర్నర్ నిర్ణయం కోసమే తాము వేచి చూస్తున్నామని తెలిపారు. ఇక తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ జయలింగం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువడగానే తామంతా బయటకు వస్తామని, అలాగే ఇక్కడ క్యాంపులో ఎవరూ నిరాహార దీక్షలు చేయడం లేదని కూడా రామ జయలింగం చెప్పారు. ఎమ్మెల్యేల క్యాంపు వద్దకు డీజీపీ రాజేంద్రన్ బయల్దేరారన్న కథనాలు రాగానే శశికళ వర్గం అప్రమత్తమైంది. తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో ప్రకటనలు ఇప్పించడంతో పాటు తేడాగా చెబుతారని భావించిన ఎమ్మెల్యేలను కూడా క్యాంపు నుంచి వేరే ప్రాంతాలకు తరలించేసినట్లు తెలిసింది. సంబంధిత కథనాలు చదవండి.. ఎమ్మెల్యేలంతా ఏమయ్యారు: హైకోర్టు మరోసారి మీడియా ముందుకు పన్నీరు వర్గం శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి? శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!