వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం మహిళలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందని, అమానుషమైన ట్రిపుల్ తలాఖ్ విధానం నుంచి విముక్తి లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు.