మెగా బ్రదర్ నాగాబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆయన తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ తేల్చేశారు. ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేసిన నాగాబాబు అంతే ఘాటుగా వర్మ విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు.
Jan 8 2017 7:19 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement