విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలకు, సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆహ్వానం పంపారు.