తాను రాజీ పడకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చేవి కావంటున్న చంద్రబాబు నాయుడు మాటల వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏంటనేది కూడా ఇప్పటివరకూ స్పష్టం కాలేదన్నారు. ప్యాకేజీ గురించి ముందే తెలిసుంటే డ్రామలెందుకని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటునే పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులెందుకని ప్రశ్నించారు.