రేపు మోదీతో కేసీఆర్ భేటీ! | tomarrow kcr meeting with prime minister narendra modhi | Sakshi
Sakshi News home page

Nov 18 2016 7:19 AM | Updated on Mar 20 2024 1:57 PM

పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. అందుకు స్పందించిన ప్రధాని శుక్రవారం ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. చర్చలకు అందుబాటులో ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవలం బించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా అందించాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ ఢిల్లీకి బయ ల్దేరనున్నారు. శనివారం ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమం త్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిం ది. అంతకుముందు పెద్దనోట్ల రద్దు నిర్ణ యంతో రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభా వాన్ని సీఎం ఉన్నతాధికారులతో సుదీర్ఘం గా సమీక్షించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement