గత నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ ముహూర్తాన ప్రకటన చేశారోగానీ అప్పటి నుంచి నగదు కోసం సామాన్యులు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు లేనివాళ్ల పరిస్థితి కనాకష్టంగా ఉంది. చాలావరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎంతసేపు క్యూలో నిలుచున్నా.. డబ్బులు లేవని బ్యాంకులు తిప్పిపంపుతున్న సందర్భాలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్ర నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాలని ఉదార సలహాలు ఇస్తున్నది. త్వరలోనే కష్టాలు తగ్గుతాయని చెప్తున్నది.