పిడుగుపాటుకు ముగ్గురు మృతి | thunderbolt kills three in nizambad district | Sakshi
Sakshi News home page

Sep 15 2015 3:41 PM | Updated on Mar 20 2024 5:21 PM

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం జూపల్లి గ్రామం సమీపంలోని పత్తిచేనులో పిడుగు పడి ముగ్గురు మహిళలు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు...గ్రామానికి చెందిన గైని లక్ష్మీ, ఊషం సంగీత, గైని వాణి అనే ముగ్గురు మహిళలు మంగళవారం పొలం పనుల్లో ఉన్న సమయంలో భారీగా వర్షం కురవడంతో చెట్టుకిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటంతో ముగ్గురు అక్కడకక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మహిళలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement