మహిళా న్యాయవాదిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు | three member committee to probe sexual harassment allegations on former judge | Sakshi
Sakshi News home page

Nov 12 2013 4:22 PM | Updated on Mar 21 2024 7:46 PM

క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని ఓ గదిలో తనను సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లైంగికంగా వేధించారని నవంబర్ 6 తేదిన ఇండియన్ జర్నల్ ఆఫ్ లా అండ్ సొసైటి బ్లాగ్ లో భాదితురాలు స్టెల్లా జేమ్స్ ఆరోపణలు చేశారు. తన తాత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న న్యాయమూర్తి తనను శారీరకంగా హింసించారు అని బ్లాగ్ స్టెల్లా తెలిపింది. ప్రస్తుతం ఓ ఎన్జీవో సంస్థలో న్యాయవాదిగా పని చేస్తున్న స్టెల్లా ఇంటర్వ్యూను ఇటీవల లీగల్లీ ఇండియా పబ్లికేషన్ ప్రచురించింది.. తానేకాక మరో నలుగురు అమ్మాయిలు మరో నలుగురు న్యాయమూర్తిలతో వేధింపులకు గురయ్యారని.. ఆ విషయం తనకు తెలుసు అని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియచేయడంతో.. తన ప్రతిష్ట, కెరీర్ సందిగ్ధంలో పడింది అని తెలిపింది. తనపై ఓ న్యాయమూర్తి లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ ట్రైనీ న్యాయవాది స్టెల్లా జేమ్స్ చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం స్పందించారు. లైంగిక వేధింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటాం అని అన్నారు. ఉన్నతమైన వ్యవస్థకు తాను నేతృత్వం వహిస్తున్నాను. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాను. స్టెల్లా ఆరోపణలలో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలుసుకుంటాను అని సదాశివం అన్నారు. స్టెల్లా ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటిని సదాశివం నియమించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement