పంజాబ్‌లోని బతిండాలో కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షో సమీపంలో కారులో పేలుడు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మౌర్ మండీ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి హర్మిందర్ జస్సీ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నాడని, మృతుల్ని గుర్తించాల్సిఉందని బతిండా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘన్ శ్యామ్ థోరీ చెప్పారు.
Feb 1 2017 7:02 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement