తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు | Telangana Medical Council Formed | Sakshi
Sakshi News home page

Jan 7 2016 7:46 AM | Updated on Mar 20 2024 3:45 PM

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పా టైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోప్రపంచంలో ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా తెలంగాణలో వైద్యం చేయాలంటే ఈ కౌన్సిల్ లో తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రం విడిపోయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లోనే వైద్యులు తమ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. తాజాగా రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కావడంతో తెలంగాణ వైద్యులకు వెసులుబాటు కలిగింది. ఇప్పటికే తెలంగాణలో ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement