ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టిన వ్యవహారంలో టీడీపీలో చెలరేగిన నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం వేదికగా తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీ(రాజ్యసభ) సీఎం రమేశ్‌పైకి కొందరు కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశ ప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది.