అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సాక్షి పత్రిక, టీవీ చానల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం శాసనసభలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చను పక్కదారి పట్టించిన టీడీపీ ఎమ్మెల్యేలు ‘సాక్షి’పై విమర్శలకు దిగారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాత్ర ఉందని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.