మండలి చైర్మన్గా స్వామిగౌడ్ ఎన్నిక | swamy-goud-elected-as-telangana-council-chairman | Sakshi
Sakshi News home page

Jul 2 2014 12:55 PM | Updated on Mar 22 2024 11:31 AM

తెలంగాణ శాసనమండలి చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మండలి ఛైర్మన్గా ఆపార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన మండలి చైర్మన్ ఎన్నికల్లో పోలైన ఓట్లులో మొత్తం 21 స్వామిగౌడ్కే వచ్చాయి. దాంతో స్వామిగౌడ్ ఎంపిక లాంఛనమే అయ్యింది. స్వామిగౌడ్ను మద్దతుగా ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఆమోస్, భూపాల్ రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, యాదవ్ రెడ్డి, రాజేశ్వరరావు టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు వేశారు. ఎన్నిక అనంతరం తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు... స్వామిగౌడ్ ఎన్నికను అధికారికంగా వెల్లడించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నేతలు స్వామిగౌడ్ను ఛైర్మన్ కుర్చీ వరకూ సాదరంగా తోడ్కొని వెళ్లి అభినందనలు తెలిపారు. మండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్ బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement