సుప్రీంలో సుజనాకు చుక్కెదురు | supreme court dismiss sujana chowdary petition | Sakshi
Sakshi News home page

Sep 1 2015 3:42 PM | Updated on Mar 21 2024 8:52 PM

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేయాలని మారిషస్ బ్యాంకు పెట్టుకున్న పిటిషన్‌ను సింగిల్ జడ్జి కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుజన యూనివర్శల్ ఇండస్ట్రిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేంద్రమంత్రి సుజనా చౌదరీకి సంబంధించిన సుజన ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ సంస్ధ హైస్టియా కంపెనీకి మారిషస్ బ్యాంక్‌ అప్పు ఇచ్చింది. ఐతే తాము ఇచ్చిన వంద కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో హైస్టియా కంపెనీ విఫలమైందని, అందువల్ల గ్యారంటర్‌గా ఉన్న సుజనా ఇండస్ట్రీస్‌ను లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement