ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్(విదేశీ రుణ సాయం) ప్రాజెక్టుల(ఈఏపీ) రూపంలో అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.