బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అడ్వాణీ, ఇతరులపై కేవలం సాంకేతిక కారణాలతో కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. అడ్వాణీతోపాటు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ఇతరులపై కేసు ఉపసంహరణకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.