’వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోండి' | RTC Strike poses a challenge for AP Government to conduct Eamcet | Sakshi
Sakshi News home page

May 7 2015 2:18 PM | Updated on Mar 21 2024 11:25 AM

ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-2015కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్తో భేటీ అయ్యారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్, డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement