ఎల్బీనగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు, 8 బస్సులు సీజ్ | RTA officials seize 8 buses in lb nagar | Sakshi
Sakshi News home page

Nov 8 2013 10:20 AM | Updated on Mar 21 2024 6:35 PM

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విజయవాడ నుండి వస్తున్న వాహనాలను ఆర్టీఎ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఆపి తనిఖీలు నిర్వహించారు. పర్మిట్‌, ఫిట్‌నెస్‌ లేని 8 ప్రైవేటు బస్సులను సీజ్‌ చేశారు. ఇందులో ఎస్వీఆర్‌, తిరుమల, కావేరి, భాను, మార్నింగ్‌స్టార్‌ ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయి. ప్రయాణికులను మార్గ మాధ్యలోనే దింపేసి బస్సులను సీజ్‌ చేశారు. ఆర్టీఎ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చెక్‌పోస్ట్‌ వద్ద పర్మిట్‌ లేని 5 బస్సులను ఆర్టీఎ అధికారులు సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement