పాతనోట్ల డిపాజిట్లపై ఆంక్షలు | restrictions on The old banknotes deposits | Sakshi
Sakshi News home page

Dec 20 2016 6:59 AM | Updated on Mar 20 2024 3:11 PM

రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం సోమవారం మరిన్ని ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 19 నుంచి 30 వరకూ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. రూ. 5 వేలకు మించి డిపాజిట్‌ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని పేర్కొంది. తాజా నిబంధనలతో నల్ల కుబేరుల కోసం ప్రవేశపెట్టిన గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద భారీగా పాత నోట్లు బ్యాంకులకు చేరవచ్చనే ఆశాభావంతో ఉందని భావిస్తున్నారు. నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ... డిసెంబర్‌ 30 వరకూ ఖాతాల్లో పాత నోట్లను ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement