ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకుని ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యత్నిస్తున్నారని పీసీసీ ఆరోపించింది. ప్రధాని చొరవ చూపితే ఈ కేసునుంచి బాబుకు తాత్కాలికంగా ఉపశమనం లభించినా మున్ముందు తప్పించుకోజాలరని హెచ్చరించింది. టీడీపీ ఏడాది అవినీతి పాలనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబనే విషయం స్పష్టమైందని, అయితే దోషులకు శిక్ష పడాలనే నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఏపీ, తెలంగాణ సీఎంలు సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోనే చంద్రబాబు రూ. 4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.
Jun 16 2015 7:06 AM | Updated on Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement