ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు కుదరటంలో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. అఖిలేశ్ వర్గంతో కాంగ్రెస్ మహామహులు చర్చలు జరిపినా, నేరుగా రాహుల్ గాంధీ మాట్లాడినా పొత్తు విషయంలో ముందుకు సాగని వ్యవహారం.. ప్రియాంక రంగంలోకి దిగటంతోనే సెటిలైనట్లు తెలుస్తోంది.