‘ప్రోగ్రెస్(అభివృద్ధి), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), పీస్(శాంతి).. ‘3పీ’ అజెండాగా మా కూటమి ఏర్పడింది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోన్న బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లను నిలువరించడానికే మేం జట్టుకట్టాం’అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, 3పీకి పీపుల్స్(ప్రజా) అనే మరో పదాన్ని జోడించిన అఖిలేశ యాదవ్.. తమది ‘ప్రజాకూటమి’అని తేల్చిచెప్పారు. తప్పుడు నిర్ణయాలతో దేశాన్ని క్యూలైన్లో నిలబెట్టిన మోదీకి ప్రజాకూటమి గట్టి సమాధానం చెబుతుందని ఉద్ఘాటించారు.