సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ ను తూర్పారాపట్టిన కొద్ది గంటలకే.. దాయాది దేశంలో ఆయన పర్యటించనున్నారన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ లో జరగనున్న సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు అవుతారని పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలే వెల్లడించారు. పాక్ ప్రముఖ మీడియా సంస్థలు మంగళవారం ఈ వార్తలను ప్రచురించాయి. సోమవారం కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత హైకమిషనర్ మోదీ పాక్ పర్యటన సహా పలు అంశాలపై మాట్లాడినట్లు పేర్కొన్నాయి.
Sep 6 2016 7:42 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement