ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్ధానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.