జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లా పాంపోర్ లో దాదాపు 50 గంటలు కొనసాగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ బుధవారం మధ్యాహ్నం తర్వాత ముగిసింది. ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(ఈడీఐ) హాస్టల్ భవంతిలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులనూ మట్టుపెట్టామని, వారి నుంచి రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని ఆపరేషన్ కు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ అశోక్ నరూలా (జీవోసీ విక్టర్ ఫోర్స్) మీడియాకు చెప్పారు.