ఉత్తరప్రదేశ్ లో వందశాతం గెలుపు తమదేనని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు రాంగోపాల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా వార్తా చానళ్లు కొద్ది రోజుల క్రితమే ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను మార్చినట్టు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పారు.