సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మిటన్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఆమెను తీర్చిదిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఇద్దరూ బ్రెజిల్ నుంచి వస్తున్నారు. వాళ్లకు స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు క్యూలో నిలబడ్డారు. విమానాశ్రయంలో సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం 'ఇంటర్నేషనల్ అరైవల్స్' ద్వారం ఉంటుంది. సింధు, గోపీ తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకొచ్చారు.
Aug 22 2016 2:33 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement