రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పార్మేట్లో రాజీనామా లేఖను ఫాక్స్లో లోక్సభ స్పీకర్కు పంపినట్లు ఆయన తెలిపారు. స్పీకర్ కార్యాలయం తనను వ్యక్తిగతంగా కలవమని పిలిస్తే ఢిల్లీ వెళ్లి కలుస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తాను రాజీనామా చేయనున్నట్లు ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ విషయం చెప్పారు. చెప్పిన ప్రకారంమే ఈరోజు ఆయన రాజీనామా చేశారు. తెలుగు ప్రజలతో కేంద్రం ఆడుతున్న నాటకానికి నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు మేకపాటి తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ఆయన విమర్శించారు. వారి ఫైటింగ్ అంతా సినిమాలలో మాదిరి ఉత్తుత్తి ఫైటింగ్ అన్నారు.
Aug 5 2013 3:41 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement