కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అతని తమ్ముడు మల్లాది శ్రీనివాస్(బుల్లియ్య)లను గురువారం రాత్రి 11.20 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. విష్ణును బుధవారం దాదాపు 12.30 గంటలపాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గురువారం కూడా విచారించారు. బార్ లెసైన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుందరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కె.ఎ.లక్ష్మిని కూడా పిలిపించిన విచారణ అధికారులు.. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో విష్ణుతోపాటు మిగిలినవారిని ఎదురెదురుగా పెట్టి విచారించారు.