సారా బట్టీల స్థావరాలపై పోలీసుల కార్డన్ సెర్చ్ | madhapur-police-conduct-cordon-operation | Sakshi
Sakshi News home page

Mar 9 2015 9:10 AM | Updated on Mar 22 2024 10:59 AM

నగరంలోని శివారుప్రాంతంలో సారా బట్టీల సరఫరా యథేచ్చగా కొనసాగుతోంది. గతకొంతకాలంగా నానక్రామ్గూడలో సారా బట్టీల స్థావరాల నుంచి గుడుంబాను భారీగా సరఫరా చేస్తున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 400మంది పోలీసులతో సోమవారం ఉదయం నుంచి నగరంలోని నానక్రామ్గూడలో గుడంబా, సారా బట్టీల స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement