విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.