తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ నెల 10న శాసనసభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. 11న తేదీన 11 గంటలకు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Jun 9 2014 10:38 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement