చేనేత ప్రచారకర్తగా కేటీఆర్‌.. | KTR as Handloom Ambassador | Sakshi
Sakshi News home page

Jan 3 2017 9:52 AM | Updated on Mar 20 2024 5:24 PM

రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా మారారు. చేనేత దస్తులు ధరించి వచ్చి సోమవారం సచివాలయంలో సందడి చేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరిం చాలని పిలుపునిచ్చిన మంత్రి.. సోమవారం స్వయంగా ఆ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రి పిలుపు మేరకు ఆయన కార్యాలయం అధికారులు, సిబ్బంది కూడా ఆ దుస్తులే ధరించి రావడంతో ప్రత్యేకత సంతరిం చుకుంది. ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని మంత్రి తెలిపారు. దీని ద్వారా చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేందుకు తెలంగాణ చేనేత శాఖ (టెస్కో) ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement