అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రానికి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం (జేఎన్‌టీయూ–ఏ) వైస్ చాన్స్‌లర్ ఎంఎంఎం సర్కార్ (65) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాబా ఫకృద్దీన్ (32), డ్రైవర్ నాగప్రసాద్ (30) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం కోసం బుధవారం సాయంత్రం జేఎన్‌టీయూ వీసీ తన పీఏతో కలిసి కారులో బయల్దేరారు.