ఫుకుషిమా ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంపతీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దీనికి సంబంధించి ఎలాంటి సునామీ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేయలేదు. భూకంప కేంద్రం భూమికి 6 కిలోమీట్లర లోతున్న ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అలాగే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది.