కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఓ టీవీ షోలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 18న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, గతేడాది జూలై 11న కూడా 'జబర్దస్త్' లో కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Dec 21 2014 3:01 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement