'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ హైకోర్టు అనుమతి | High court green signal for apngos save andhra pradesh sabha | Sakshi
Sakshi News home page

Sep 6 2013 12:33 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఏపీ ఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఉద్యోగులు కానివారు సభకు అనుమతించరాదని న్యాయస్థానం ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎల్బీ స్టేడియంలోని ఏర్పాట్లను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ సభకు ఎంతమంది వస్తారన్న దానిపై అంచనా లేదన్నారు. అయితే ఎవరూ గుంపులు, గుంపులుగా రావద్దని ఆయన సూచించారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్‌ బాబు కోరారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని అశోక్ అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement