కుండపోత. | heavy rains in telangana states | Sakshi
Sakshi News home page

Sep 15 2016 6:34 AM | Updated on Mar 20 2024 3:30 PM

మహానగరం మళ్లీ అల్లాడింది. బుధవారం కురిసిన కుండపోతతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. అటు హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు దాకా.. ఇటు అల్వాల్ నుంచి మాదాపూర్ దాకా భారీ వర్షం కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. నాలాలు పొంగిపొర్లాయి. అనేకచోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాంనగర్ నాలా పొంగడంతో నాగమయ్య కుంటలోని గుడిసెల్లోకి నీరు చేరింది. ఇక్కడ నారాయణ(60) వర్షం నీటిలో మునిగి చనిపోయాడు

Advertisement
 
Advertisement
Advertisement