త్తమ పాలనకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తప్పనిసరని, ప్రజాస్వామ్యంలో అదే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుపరిపాలన సాధించాలంటే ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అమెరికా తరహాలో మొదటిసారి నిర్వహించిన టౌన్‌హాలు(పాలనలో పౌరుల సమస్యలపై చర్చ) కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం మోదీ ప్రసంగించారు.