ఎంసెట్ పరీక్షకు తేదీ ఖరారు! | Eamcet-2017 on May12th Announced by Higher Education Council | Sakshi
Sakshi News home page

Jan 13 2017 7:24 AM | Updated on Mar 22 2024 11:30 AM

వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18) ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ మినహా మిగతా అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కోర్సులు, ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌) ప్రవేశాల కోసం మే 12న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీంతోపాటు బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, యూజీడీపీఈడీ, బీపీఈడీ, మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎంఈ/ ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ప్లానింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలనూ ఖరారు చేశామని నిర్వహణ విద్యా సంస్థలను ఎంపిక చేశామన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement