ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు! | don't given to original certificates! | Sakshi
Sakshi News home page

Jul 22 2015 8:03 AM | Updated on Mar 21 2024 11:25 AM

ఇంజనీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని.. మొదటి దశ ప్రవేశాల్లో సీటు వచ్చినా, రెండో దశ ప్రవేశాలు పూర్తయ్యే వరకు కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, స్పెషల్ ఫీజుల వంటివి చెల్లించొద్దని ఇంజనీరింగ్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ సూచించారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళతామంటే సర్టిఫికెట్లు, డబ్బు తిరిగి ఇవ్వడం లేదనే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పారు. తమకు కేటాయించిన సీటును విద్యార్థులు వెబ్‌సైట్లో ‘యాక్సెప్టెన్సీ’ బటన్ నొక్కి కన్‌ఫర్మ్ చేస్తే చాలని, అడ్మిషన్ నంబర్ కూడా వచ్చేస్తుందని తెలిపారు. దానిని కాలేజీ యాజమాన్యం నిరాకరించడానికి వీల్లేని విధంగా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇదివరకు విద్యార్థి కాలేజీలో రిపోర్టు చేశాక కాలేజీ వారే ధ్రువీకరించే విధానం ఉండగా.. ఈసారి దానిని మార్చేశామన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement