ఢిల్లీలో మహిళలపై ఆగడాలు ఎక్కువవుతున్నాయి. దినదినం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఒక ప్రదేశమంటూ మినహాయింపు లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి మహిళపట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆమెను వేధింపులకు గురిచేయడమే కాకుండా అనకూడని మాటలు అన్నాడు. ఆ వ్యక్తిని ఫొటో తీసేందుకు ఆమహిళ ప్రవర్తిస్తుండగా ఫొటో తీస్కోని నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నంతగా హెచ్చరించాడు. దీంతో అతడిని తన ఫోన్లో ఫొటో తీసిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.