రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు | complaint-against-ram-gopal-varma | Sakshi
Sakshi News home page

Aug 31 2014 2:40 PM | Updated on Mar 21 2024 5:46 PM

ట్విట్టర్‌లో వినాయకుడిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యానించిన వర్మపై చర్యతీసుకోవాలంటూ చంపాపేటకు చెందిన న్యాయవాది కె.కరుణసాగర్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ ట్విట్టర్‌లో రాంగోపాల్‌వర్మ పోస్ట్ చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై 295ఏ, 298, 504 ఐపీసీ, ఐటీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ ఫిర్యాదులో కోరారు. అలాగే, బీజేపీ యువ మోర్చా హైదరాబాద్ ఉపాధ్యక్షుడు నిరంజన్ యాదవ్ కూడా శనివారం మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై శాఖ చీఫ్ సుమిత్ ఖంబేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement