పిట్టల దొర చేతిలోని కట్టె తుపాకీ పేలుతుందా? అతడి నోటి నుంచి కోతలే తప్ప తుపాకీ నుంచి తూటాలు రావు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలాంటి గొప్పలే చెప్పుకుంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన రెయిన్ గన్లు రాయలసీమలో 4 రోజుల్లో 4.69 లక్షల ఎకరాల్లోంచి కరువు రక్కసిని తరిమికొట్టాయట!