నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు

Published Wed, Dec 14 2016 6:53 AM

ఓ పోలీసు అధికారే.. ఘరానా మోసగాడిగా మారి లక్షలు కాజేసిన కేసును పోలీసులు ఛేదించారు. సీఐతో సహా 11 మందిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.52 లక్షల కొత్త కరెన్సీతో పాటు రెండు కార్లు, ఒక బొమ్మ తుపాకీ, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత పెద్దముక్కుళ్ల తిరుమలేష్‌నాయుడు.. టప్పాచ బుత్ర అదనపు ఇన్‌స్పెక్టర్‌ ఎర్రంశెట్టి రాజశేఖర్‌ కలసి పక్కా పథకాన్ని రూపొందించారు. తమ వద్ద పాత కరెన్సీ ఉందని.. కొత్త నోట్లు కావాలని, దీనికి కొంత కమీషన్‌ కూడా ఇస్తామంటూ కొందరు వ్యాపారులను ఫిలింనగర్‌లోని గెస్ట్‌హౌజ్‌కు రప్పించారు. సరిగ్గా నోట్లు మార్చుకునే సమయంలో సీఐ రాజశేఖర్‌ యూనిఫాంలో వెళ్లి తుపాకితో బెదిరించి రూ.2 వేల నోట్ల కొత్త కరెన్సీతో పాటు రూ.78 లక్షలు దోచుకెళ్లారు. ఆ సొమ్మును తిరుమలేశ్‌కు అప్పజెప్పాడు.