గోదావరి పుష్కరాలతో పుణ్యం, పురుషార్ధం లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పుష్కరాల ఉచిత బస్సును ఆయన రాజమండ్రిలో ప్రారంభించారు. రేపు ఉదయం 6.26 గంటలకు మహాపుష్కరాలు ప్రారంభం అవుతాయన్నారు. గోదావరి నదితో తెలుగు జాతికి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరూ గోదావరితో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.